Illegal Relationship: ఇటీవల అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో కొంతమంది అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అక్రమ బంధాల మోజులో పడి జీవిత భాగస్వాములను చంపుకుంటున్నారు. అనంతరం రోడ్డుపాలు అవుతున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ పెళ్లయిన మహిళ ఒకే గదిలో ఇద్దరు మగవారితో రాసలీలలో ఉండగా సడన్ గా అత్త ఎంట్రీ ఇచ్చింది. కోడలు అలా చేయడం చూసి కోపోద్రిక్తురాలై గదికి తాళంవేసి పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.
Read Also: America : కాలింగ్ బెల్ కొట్టినందుకు కారుతో గుద్ది కాటికి పంపాడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే వ్యక్తి పక్క గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్దిరోజులకు సదరు వ్యక్తి ఉపాధికోసం సౌదీ అరేబీయా వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో.. భార్య పక్కగ్రామంలోని తన పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కొద్దికాలానికి పుట్టింటి వద్ద తనకు బంధువులైన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ఆ ఇద్దరితో కలిసి వస్తుండేది. ఇలా అక్రమ సంబంధం వ్యవహారం గుట్టుచప్పుడుగా కొంత కాలం సాగించింది.
Read Also: TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
మెట్టినింటికి వచ్చిన తర్వాత కొద్దిరోజులకు వారిద్దరిని నేరుగా ఇంటికి పిలవడం మొదలు పెట్టింది. అత్తామామలకు తమ అమ్మవారి తరపు బంధువులని చెప్పేది. పలుసార్లు వాళ్లు ఇంటికి వచ్చిపోతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికిరాగా.. తన కోడలు, ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉన్నారు. రూంలో వారు ఏం చేస్తున్నారో చూసేందుకు అత్తవెళ్లగా.. తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో రాసలీలల్లో లీనమైపోగా… కోడలు చేసే పనిని కన్నంలో నుంచి చూసి కంగుతింది. ఎలాగైనా రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవాలని భావించింది. కొడుకుకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే లావుపాటి తాళం తెచ్చి రూం తలుపుకు వేసింది. వెంటనే ఫోన్ అందుకుని 112 నెంబర్‌కు డయల్ చేసి పోలీసులకు విషయం చెప్పంది. పోలీసులు అక్కడికి చేరుకొని వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మహిళ తన కోడలుపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు వెళ్లి చూడగా.. కోడలు ఇద్దరు వ్యక్తులతో అభ్యంతరకర స్థితిలో ఉందని, దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.