Serial Rapist : సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేసి చంపాడో నీచుడు. యూపీ వాసి, సీరియల్ రేపిస్ట్ రవీందర్ కుమార్‌ను ఢిల్లీలోని రోహిణి కోర్టు దోషిగా నిర్ధారించింది. దాదాపు 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుడు కోర్టు ఎదుట అంగీకరించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ నివాసి. అతను ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. రవీందర్ కుమార్ రోజుకు 40 కి.మీ నడిచి చిన్నారులపై లైంగిక దాడి చేసి చంపేసేవాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 2008 – 2015 మధ్య అతను దాదాపు 30 మంది పిల్లలను చంపాడు. బాధితుల్లో ఓ చిన్నారి వయస్సు కేవలం రెండేళ్లు కాగా.. అత్యధిక వయస్సు ఉన్న బాధితురాలి వయస్సు పన్నెండేళ్లు. కాగా.. 2008లో 18 ఏళ్ల రవీంద్ర కుమార్ ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. తండ్రి ప్లంబర్.. తల్లి పనిమనిషిగా చేస్తోంది. అతడు కూడా కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే రవీంద్రకుమార్ డ్రగ్స్ కు బానిసయ్యాడు.
Read Also:Manhole: మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
రవీందర్ కుమార్ తన 18 ఏళ్లప్పుడు రెండు అశ్లీల చిత్రాలను చూశాడు. ఆ తరువాత అతడిలోని సీరియల్ రేపిస్ట్, హంతకుడు మేల్కొన్నాడు. అప్పటి నుంచి అతడు అత్యాచారం, హత్యలు చేయడం ఆరంభించాడు. కూలీలు పొద్దంతా పనిచేసి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి తమ మురికివాడల్లో పడుకోగానే తన వేట ప్రారంభించేవాడు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య పిల్లలను రూ.10 నోట్లు లేదా మిఠాయిలతో ప్రలోభపెట్టేవాడు. ఏకాంత భవనం లేదా ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. తనను మళ్లీ వారు ఎక్కడ గుర్తిస్తారో అనే భయంతో చాలా మంది పిల్లలను అక్కడే చంపేసేవాడు. 2014లో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నం, శారీరకంగా వేధించడం వంటి కేసుల్లో ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. అయితే 24 ఏళ్ల వయసులో 2015లో మొదటి సారిగా అరెస్టయి తీహార్ జైలులో ఉన్నాడు.
Read Also:Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు
రవీందర్ కుమార్.. బదౌన్, బాబా హరిదాస్ కాలనీ, బేగంపూర్, కంఝవాలా, హత్రాస్‌తో సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నేరాలకు పాల్పడ్డాడు. ఔటర్ ఢిల్లీలోని కంఝవాలా, ముండ్కాలో 2011లో రెండు నేరాలు చేసినట్లు రవీందర్ అంగీకరించాడు. 2012లో అలీగఢ్‌లో జరిగిన వివాహ వేడుకలో తన అత్త దగ్గర ఉన్న సమయంలో బంధువులకు చెందిన 14 ఏళ్ల ఇద్దరు పిల్లలను రేప్ చేసినట్లు అంగీకరించాడు. 2015లో జరిగిన విచారణ సమయంలో అతడు లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడిన 15 స్థలాలను అధికారులకు చూపించాడు.