Air Pollution: వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా 52 ఏళ్ల మంత్రగాడు 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో జరిగింది. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. యువతిపై ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడిని శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం మనా పాస్‌కు చేరుకుని సరిహద్దుల్లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు.
Peegate Incident: ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులు తప్పతాగి సహ ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనల్ని మనం చూశాం. అయితే రైలులో కూడా తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు పీకలదాకా తాగి వృద్ధ దంపతులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు…
భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 2024 జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. శ్రీరామ నవమి వేడుకలను అయోధ్య రామ మందిరంలో నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరంలో ఉండే రాముడి విగ్రహాన్ని ఓ రహాస్య ప్రాంతంలో ముగ్గురు శిల్పులు చెక్కుతున్నారు.
ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు రీల్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. మెట్రో లేదు, రోడ్డని లేదు ఆఖరికి పవిత్రమైన గుడిలో కూడా ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేసి ఇక్కట్ల పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే రీల్స్ పిచ్చితో విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్నారు. స్కూల్ లోనే వీడియోలు చేస్తూ వాటిని లైక్ షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ…