PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Independence Day 2026 Speech: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ పురోగతికి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది. జెండా ఆవిష్కరణ అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఒకవైపు దేశాభివృద్ధిని వివరిస్తూనే, మరోవైపు ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల విలవిలలాడిన ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ తన గాఢమైన సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం మాత్రమే కాదు, 140 కోట్ల మంది పౌరులతో కూడిన దేశమంతా బాధితులకు అండగా నిలుస్తుందని, వారికి అన్ని రకాలుగా పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం జాతీయ గీతాల గొప్పతనాన్ని స్మరిస్తూ, ఈ ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారిగా ‘వందేమాతరం’ నినాదాలు ప్రతిధ్వనించడం అత్యంత చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. వందేమాతరం గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో ఈ ఘటన జరగడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని మోడీ హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఊహించని వేగంతో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని గుర్తుచేశారు. దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, వృద్ధులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల పౌరులందరి కృషి, పట్టుదలే ఈ పురోగతికి ప్రధాన కారణమని వారి సేవలను కొనియాడారు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాల గణాంకాలను వివరిస్తూ.. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 7 రెట్లు పెరిగాయని వెల్లడించారు. వీటితో పాటు ఆధునిక రైల్వే కోచ్‌ల తయారీ 21 రెట్లు పెరగ్గా, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ఏకంగా 33% పెరిగిందని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు 100% వృద్ధిని నమోదు చేయడం భారత్ సాధించిన సాంకేతిక విప్లవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పూర్తిస్థాయి ‘అభివృద్ధి చెందిన దేశం’గా (డిజిటల్ అండ్ డెవలప్డ్ నేషన్) మారినప్పుడు, జగత్తు మన దేశాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
దేశానికి అత్యంత కీలకమైన ఇంధన భద్రత (Energy Security) పై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకప్పుడు దేశీయంగా ఏమీ చేయలేక ‘నో-గో ఏరియా’లుగా ఉన్న రంగాలను ఇప్పుడు ‘గో-అహెడ్ ఏరియా’లుగా మార్చేశామని చెప్పారు. ఇంధన అవసరాల కోసం భారత్ సాధిస్తున్న పురోగతిలో భాగంగా ఈ ఏడాది ‘ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీ’లో అగ్రస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కైవసం చేసుకోవడం పరమావధి అని, ఇది అణు ఇంధన రంగంలో స్వయంసమృద్ధికి పెద్ద పీట వేస్తుందని వ్యాఖ్యానించారు. కొరత వనరులలో లేదని, మన ఆలోచనా పరిమితుల్లోనే ఉండిపోతుందని.. ఆలోచనలు పరిమితమైనప్పుడు మన సొంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేమని హెచ్చరించారు. అందుకే భవిష్యత్తు అవసరాల కోసం 200 గిగావాట్ల (GW) అణుశక్తిని లక్ష్యంగా పెట్టుకుని, కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
మరోవైపు ఇంధన అన్వేషణలో భాగంగా ఒకప్పుడు భారతదేశంలో 98% తీరప్రాంత (Offshore) ఇంధన నిల్వల అన్వేషణపై ఉన్న ఆంక్షలను సవరించి, చమురు, సహజ వాయువు అన్వేషణల కోసం ఈ ప్రాంతాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చినట్లు మోడీ వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ.. ఇప్పటివరకు దేశంలో 1.75 కోట్ల ఇళ్లకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు అందించామని, అలాగే 50 లక్షలకు పైగా గృహాలు సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని తెలియజేశారు. పరాయి దేశాలపై ఆధారపడటం మాని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వయంసమృద్ధిని మరింత బలోపేతం చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర భారత్’ సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, ప్రస్తుతం ప్రతి భారతీయుడు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాలతో మమేకమై దేశ పురోగతిలో భాగస్వామి అవుతున్నారని స్పష్టం చేశారు. మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు.. ఇతర దేశాలపై ఆధారపడితే మన సామర్థ్యం పెరగదు.. మన ప్రయోజనాలను మనమే కాపాడుకోవాలి.. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!