ప్రాంక్ చేయబోయి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ మెడకు ఉచ్చుబిగుసుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఓరై ప్రాంతంలోని కాన్షీరాం కాలనీలో ఓ బాలుడు తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాన్షీరాం కాలనీ పోలీసు ఔట్‌పోస్టు ఇన్చార్జి మహ్మద్ ఆరీఫ్ దీని గురించి వివరిస్తూ 13 ఏళ్ల బాలుడు ప్రాంక్…
ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్‌ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్‌పై నుంచి వచ్చి…
UP Police: ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుపట్టా లాగిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, అనంతరం హత్యలు చేయడం ఆగడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా ఆడ బిడ్డల తల్లిదండ్రుల కంట కన్నీరు రాకుండా చేయలేకపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో మూల ఇలాంటి ఘటనలు జరగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు కొందరు దుండగులు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో జరిగింది. Also Read: Air Traffic: విమానాల్లో తెగ తిరిగేస్తున్న జనం.. ఆగస్టులో…
Superintendent Brutally Trashes Girl In UP Juvenile Home: బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన బాధ్యత జువెనైల్ హోమ్ అధికారులది. తెలిసి, తెలియక చేసిన నేరాలకు వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని తీర్చిదిద్దాల్సిన అక్కడి సిబ్బంది కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలవంచుకునే విధంగా, తండ్రిలా ఉండాల్సిన మామ, తన కొడలిపై దారుణానికి తెగబడ్డాడు. కొడుకు భార్య అనే సోయి లేకుండా అత్యాచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మామ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 26 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను బెదిరించి, తీవ్రంగా కొట్టాడని చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత సోమవారం మధ్యాహ్నం కాలేజ్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విద్యార్థినిని మార్గమధ్యంలో వదిలి నిందితులు పరారయ్యారు.
Heavy Rains in Uttar Pradesh: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వరుస వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ వరదలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మొదలు సోమవారం తెల్లవారు జాము వరుకు ఆగకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఇలాంటి పరిస్థితే మరో నాలుగురోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ…
Uttar Pradesh: ట్రైన్ లో ఓ బోగీలో ఉన్నవారికి చుక్కలు చూపించారు పాములు ఆడించేవారు. తమకు కావల్సినంత డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు. భోగిలోని వారందరిని బిక్కు బిక్కుమంటూ బతికేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హౌరా, గ్వాలియర్ల నడుమ ప్రయాణిస్తుంది చంబల్ ఎక్స్ ప్రెస్. శనివారం సాయంత్రం బందా స్టేషన్ లో అందరితో పాటే ఓ నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం…