Man Beheads Wife: ‘‘టీ’’ వివాదం భార్యభర్తల మధ్య గొడవకు కారణమైంది. చివరకు భార్య తలను భర్త నరికేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఉదయం టీ తీసుకురావడం ఆలస్యమైందనే కారణంలో 52 ఏళ్ల వ్యక్తి మంగళవారం తన భార్యను కత్తితో నరికి చంపాడు. టీ చేయడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కోపం పట్టలేక ధరమ్‌వీర్ అనే వ్యక్తి 50 ఏళ్ల తన భార్య సుందరిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: PM Modi: ఖలిస్తానీ పన్నూ హత్య కుట్రపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ..
టీ చేయడానికి సమయం పడుతుందని సుందరి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ సమయంలో వారి నలుగురు పిల్లలు మరొక గదిలో నిద్రిస్తున్నారు. దాడి సమయంలో సుందరి కేకలు విన్న స్థానికులు అక్కడికి వచ్చే లోపే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. టీ చేయడంలో ధరమ్ సింగ్, సుందరి మధ్య గొడవ జరిగిందని, పదునైన ఆయుధాన్ని తీసి అతను ఆమె మెడపై దాడి చేశాడని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు ఏసీపీ జ్ఞాన్ ప్రకాష్ రాయ్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.