Man Bites Wife’s Nose: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్యను కట్నం కోసం గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కట్నం తీసుకురావాలని భార్య ముక్కును కొరికి తీవ్రంగా గాయపడిచారు. మహేష్ పూర్‌కి చెందిన అజ్మీ(22) తన భర్త కుటుంబానికి చెందిన ఆరుగురిపై సీబీ గంజ్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది.
అజ్మీ తన భర్త నజీమ్, బావ సాబీర్, కుటుంబ సభ్యులు రిహాన్, రుఖ్సర్, మాజిద్ హుస్సేన్, సయూద్ అహ్మద్‌లపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసింది. అజ్మీకి, నజీమ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 5 నెలల బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత అత్తింటి వారు అజ్మీని వేధించడం మొదలుపెట్టారు. తమకు అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధించారు.
Read Also: INDIA bloc: “ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు..
తన భర్త తనను చాలాసార్లు కొట్టాడని, ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, అయితే చాలా సందర్భాల్లో పంచాయతీల్లో రాజీ కుదురిందని బాధిత మహిళ అజ్మీ వెల్లడించారు. అయితే వరకట్నంపై తన భర్త హింసిస్తున్నాడని ఆరోపించింది. డిసెంబర్ 15న తన అత్తమామలు తనను కొట్టారని, ఆమె భర్త నజీమ్ ముక్కు కొరికి గాయపరిచాడని అజ్మీ ఆరోపించింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బరేలీ నగర ఏఎస్పీ రాహుల్ భాటీ తెలిపారు.