Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో నిన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు అంగీకరించింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని చెప్పింది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌పై శాస్త్రీయ సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ ని నిమయించేందుకు అంగీకరించింది. దీని కోసం విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయించబడుతాయని చెప్పింది.
Read Also: Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో దాడి ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!
శ్రీకృష్ణ జన్మభూమికి చెందిన 13.37 ఎకరాల భూమిని యాజమాన్యం కోరుతూ లక్నో నివాసి రంజన అగ్నిహోత్రి కేసు వేశాడు. కృష్ణ జన్మభూమిని కూల్చేసి ఆ ప్రాంతంలో షాహీ ఈద్గాను నిర్మించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669-70లో శ్రీకృష్ణ జన్మస్థలం సమీపంలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయంలోని 13.37 ఎకరాల ప్రాంగణంలో గడిని కూల్చేసిన చోటే మసీదు నిర్మించినట్లు పేర్కొన్నారు.
గురువారం అలహాబాద్ హైకోర్టులో జరిగిన వాదనల్లో హిందువుల తరుపు న్యాయవాది విష్ణు జైన్ కీలక అంశాలను కోర్టు ముందుంచారు. మసీదు యొక్క కొన్ని గోడలపై తామరపువ్వుల చెక్కడం, అలాగే హిందూ పురాణాల్లోని ‘శేషనాగ్’ని పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని పేర్కొంది. ఇది ఆలయంపై మసీదు నిర్మించబడిందని వారు వాదించారు. షాహీ ఈద్గా మసీదు హిందూ దేవాలయానికి సంబంధించ అనేక చిహ్నాలను కలిగి ఉందని, వాస్తవ స్థితిని నిర్ధారించడానికి సర్వే అవసమని డిమాండ్ చేశారు. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది, దాని కింద కృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాల భూమి మరియు మిగిలిన 2.5 ఎకరాల భూమిని మసీదుకు ఇచ్చారు. కృష్ణా జన్మభూమి-షాహి మసీదు వివాదంపై హైకోర్టులో మొత్తం 18 కేసులు ఉన్నాయి.