Rahul Gandhi: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 18 ఈ కేసును విచారించిన న్యాయమూర్తి యోగేష్ యాదవ్, వాదనలు విన్న తర్వాత విచారణలు నవంబర్ 27కి వాయిదా వేశారు. అయితే ఈ సమయంలోనే డిసెంబర్ 16న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని కోరారు.
Read Also: Minister Kakani Govardhan Reddy: జగన్ ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు సమన్లను జారీ చేసింది. జనవర్ 6న హాజరుకావాలని అందులో పేర్కొంది. రాహుల్ గాంధీ అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ హాజరుకావల్సి ఉన్నా రాలేదని మిశ్రా తరుపు న్యాయవాది పాండే తెలిపారు.