Man kills Mother: డబ్బుల కోసం ఓ కన్న కొడుకు కర్కోటకుడిగా మారాడు. తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది. రూ. 5000 ఇచ్చేందుకు నిరాకరించినందుకు 21 ఏళ్ల వ్యక్తి తల్లితో వాగ్వాదానికి దిగారు. చివరకు తల్లి గొంతు కోసి హత్య చేశాడు.
డిసెంబర్ 13న బీహార్‌కి చెందిన హిమాన్షు తన తల్లి కలిసి హిస్సార్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అతను, తన తల్లిని రూ. 5000 అడిగాడు, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తల్లి గొంతుకోసి చంపాడని పోలీసులు తెలిపారు. అదే రోజు సాయంత్రం తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకుని రైలులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాడు.
Read Also: Vijay Diwas: భారత్ ముందు తలవంచిన 90 వేల మంది పాక్ సైనికులు.. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కీలక సంఘటనలు..
అయితే, ఆ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న హిమాన్షును పోలీసులు పట్టుబడ్డాడు. సూట్‌కేస్‌ని సోదా చేయగా అందులో డెడ్ బాడీ కనిపించింది. హర్యానా పోలీసులు సంప్రదించగా.. హిమాన్షు, అతని తల్లితో అద్దెకు నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను స్కాన్ చేయడంతో హిమాన్షు ఆటోలో ఏదో ఉంచుతున్నట్లు కనిపించింది. ఈ హత్యపై తదుపరి విచారణ సాగుతోంది.