PM Modi: కమీషన్ కోసం ఇండియా కూటమి.. మిషన్ కోసం ఏన్డీయే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సహరాన్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మిషన్(లక్ష్యం) కోసం పనిచేస్తుంటే, ఇండియా కూటమి కమీషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తోందని పీఎం మోడీ ఆరోపించారు. బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నించేందుకు ప్రతిపక్ష కూటమి పోరాడుతోందని ఆయన అన్నారు.
‘‘తన పాలనలో కాంగ్రెస్ కమీషన్లు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ఇండి కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఎన్డీయే, మోడీ సర్కార్ ఒక మిషన్ కోసం పనిచేస్తున్నాయి.’’ అని ప్రధాని మోడీ అన్నారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) ప్రతీ గంటకు అభ్యర్థిని మారుస్తోందని, కాంగ్రెస్‌కి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రధాని అన్నారు. చివరకు తమ కంచుకోటల్లా భావించే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
Read Also: Maldives: భారత్‌కి మాల్దీవుల కృతజ్ఞతలు.. EAM జైశంకర్ స్పందన ఇదే…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని, అందులో కొంత భాగం వామపక్షాల ఆధిపత్యం కనిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని, దేశ ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు. ‘‘శక్తిని ఆరాధించడం మన సహజ ఆద్యాత్మిక ప్రయాణంలో భాగం, కానీ ఇండియా కూటమి ప్రజలు శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం అంటున్నారు’’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో 7 విడదల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఎంపీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!