Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unmadam OTT Release: మలయాళ సినిమాలంటేనే డిఫరెంట్ కథలు, ఊహించని ట్విస్టులు, సైకలాజికల్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. గత కొన్నేళ్లుగా కేరళ నుంచి వస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది ‘ఉన్మాదం’ (Unmadham). ఈ ఇంటెన్స్ స్టోరీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు మలయాళ స్టార్ హీరో కుంచాకో బోబన్. జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. థియేటర్లలో ఆసక్తికరమైన స్పందన తెచ్చుకున్న ఈ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ త్వరలోనే తెలుగు సహా పలు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది.
సోనీలివ్ లో స్ట్రీమింగ్
జూలై 31న థియేటర్లలో విడుదలైన ‘ఉన్మాదం’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్ సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల చివరిలోగా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన షాహి కబీర్ ఇప్పటికే ‘జోసెఫ్’, ‘నాయట్టు’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు రచయితగా గుర్తింపు సంపాదించారు. పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవాన్ని తన కథల్లో సహజంగా చూపించే ఆయన మరోసారి విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకుడిగా వ్యవహరించడం మరో ప్రత్యేకత. దాదాపు 143 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలా కాకుండా, సైకలాజికల్ డ్రామాగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Also Read
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
- Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
- Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
‘ఉన్మాదం’ కథ
ఈ స్టోరీ ఒక సాధారణ ఇన్వెస్టిగేషన్ లా మొదలై.. ఆ తర్వాత ఊహించని మైండ్ గేమ్ లా మారుతుంది. సినిమా రైటర్ అవ్వాలని కలలు కనే ఒక పోలీస్ ఆఫీసర్, క్లోజ్ అయిపోయిన ఒక పాత సూసైడ్ కేస్‌ని రీఓపెన్ చేస్తాడు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ లోతుల్లోకి వెళ్లేకొద్దీ, అది కేవలం ఆత్మహత్య కాదు.. దాని వెనుక ఒక సైకోపాత్ మైండ్ దాగి ఉందని అర్థమవుతుంది. ఆ మిస్టరీని చేధించే ప్రాసెస్ లో అతను చూసే నిజాలు అతనికి పిచ్చి లేపుతాయి.కేసు క్లైమాక్స్‌కి వచ్చేసరికి, శత్రువుల కంటే అతని సొంత బుర్రే అతనికి పెద్ద శత్రువులా మారుతుంది. ఒకవైపు ప్రాణాంతకమైన నేరస్థులు, మరోవైపు తనని మానసికంగా ముంచేస్తున్న భ్రమలు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ అతను అల్లాడిపోతాడు. తనే ఒక ఉన్మాదిలా మారే పరిస్థితి వచ్చినా, చివరి నిమిషం వరకు పోరాడి ఆ చీకటి రహస్యాన్ని అతను ఎలా బయటపెట్టాడు అనేదే ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్.
ఇటీవలి కాలంలో సోనీలివ్ ప్రాంతీయ భాషల్లో విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తూ వరుసగా క్రైమ్, థ్రిల్లర్ సినిమాలను తీసుకువస్తోంది. ఇప్పుడు ‘ఉన్మాదం’ కూడా అదే జాబితాలో చేరనుండటంతో, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
-
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!