మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీ వివాదంతో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధిస్తున్నట్లు తెలిపారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మద్యం తాగుతున్న కొడుకుని అడ్డుకున్నందకు తండ్రి హత్యకు గురయ్యాడు. తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను మరనించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. యువకుడు తండ్రి తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడైన కుమారుడు ప్రయత్నించాడు.
UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.