ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు.
ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
Delhi pollution: ఢిల్లీలో కాలుష్యానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో రావడమే అని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం అన్నారు. నగరంలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి ఇతర రాష్ట్రాల బస్సులే కారణమవుతున్నాయని, బస్ డిపోల్లో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
Bahraich violence: దుర్గా నిమజ్జనం వేళ ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా అనే యువకుడిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు.
Bahraich violence: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో దుర్గాపూజ సమయంలో అల్లర్లకు కారణమై, గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు సర్ఫరాజ్ అలియాస్ రింకు, ఫాహిమ్ నేపాల్‌కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హండా బసెహ్రీ కెనాల్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నిందితుల కాలిలో కాల్చినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు.
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Durga idol immersion in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మహసీ ప్రాంతంలో దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు ఊరేగింపు ముస్లిం ప్రాంతం గుండా వెళుతుండగా ఇరువర్గాల మధ్య ఏదో అంశంపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం సంబంధించి బహ్రైచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వృందా శుక్లా మాట్లాడుతూ..…
Crime: 17 ఏళ్ల కూతురు లవ్ ఎఫైర్, శృంగార సంబంధం గురించి తెలిసిన తల్లి, తన కూతురిని హతమార్చేందుకు ఓ కిరాయి హంతకుడిని నియమించుకుంది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సదరు హంతకుడికి సుపారీ ఇచ్చిన 42 ఏళ్ల మహిళనే అతను హతమార్చాడు.