UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
లవ్ జిహాద్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ కామప్రాయానికి బలిపశువులను చేసేవారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈరోజు ఓ విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దీనిని ప్రకృతి విపత్తుగా భావిస్తే.. మరి కొందరు అద్భుతంగా భావిస్తున్నారు.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ మధురలో దళిత బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాలికను రోడ్డు పక్కన తోసేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Bathing: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది. Read…
Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బారాబంకీలో…
Wolf Attack: ఉత్తర్ ప్రదేశ్లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ తోడేళ్ల దాడుల వల్ల బహ్రైచ్ జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. నరమాసానికి మరిగిన తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి, 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ, ఈ దాడులను అడ్డుకట్ట పడటం లేదు.
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా ఓ మహిళ తల్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.