Bahraich violence: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో దుర్గాపూజ సమయంలో అల్లర్లకు కారణమై, గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు సర్ఫరాజ్ అలియాస్ రింకు, ఫాహిమ్ నేపాల్‌కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హండా బసెహ్రీ కెనాల్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు నిందితుల కాలిలో కాల్చినట్లు తెలిపారు.
Read Also: Rahul Gandhi: హర్యానా ఓటమి నుంచి పాఠాలు.. వాల్మీకి గుడిలో రాహుల్ గాంధీ పూజలు!
ఈ హింసాకాండలో ప్రధాన నిందితులు అబ్దుల్ హమీద్, అతని కుమారులు సర్ఫరాజ్, ఫహీంలు. పారిపోతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా..? అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అక్టోబర్ 13న బహ్రైచ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఆదివారం సాయంత్రం మన్సూర్ అనే గ్రామ సమీపంలోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఉరేగింపు సమయంలో సంగీతం వినిపించడంతో ఓ వర్గం అభ్యతరం తెలిపింది. దీంతో గొడవ ప్రారంభమైంది. ఇరు వర్గాలు మధ్య గొడవ తీవ్రమైంది. అయితే, నిందితులు రెహువా మన్సూర్ గ్రామానికి చెందిన రామ్ గోపాల్ మిశ్రాని తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుడి కుటుంబాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కార్యాలయానికి పిలిపించుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.