Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మద్యం తాగుతున్న కొడుకుని అడ్డుకున్నందకు తండ్రి హత్యకు గురయ్యాడు. తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను మరనించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. యువకుడు తండ్రి తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడైన కుమారుడు ప్రయత్నించాడు.
UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ అదృశ్యమైన ఘటన యూపీలోని భాదోహిలో చోటు చేసుకుంది. బీజేపీ తరపున చైర్మన్ ఎన్నికకు పోటీ చేసిన ఓ బీజేపీ నాయకురాలిగా గుర్తించారు. అయితే.. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కానిస్టేబుల్‌తో కలిసి జంప్ అయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. తనతో పాటు తన కొడుకును తీసుకుని పారిపోయింది.