Barabanki incident: ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను…
Man Dragged Under Car For 10 km In UP: న్యూఇయర్ రోజున ఢిల్లీలో ఓ యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఇలాగే మరికొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఢిల్లీ ఘటన రిపీట్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ మథురలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు వ్యక్తి మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కారు నడుపుతున్న
Hotel Room: ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. హోటల్ రూం ఇవ్వనందుకు సిబ్బందిపై రెచ్చిపోయారు. మద్యం బాటిళ్లతో ఓ గ్యాంగ్ బిజ్నూర్లోని హోటల్ రిసెప్షన్ దగ్గరకు వచ్చింది.
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ‘రామచరిత మానస్’పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. ఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య రామచరిత మానస్ పై చేసిన వ్యాక్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా ఎస్పీ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలతు. తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్యలను బహిరంగా…
UP, Maharashtra Legislative Council Election Results: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ హావా కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా శాసనమండలి జరిగిన ఎన్నికల్లో కీలక విజయం సొంతం చేసుకుంది బీజేపీ. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని గెలుచుకుంది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కించుకోవాలనే ఆశలను బీజేపీ…
MP govt renames Bhopal's Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్…
Facebook Love: ప్రేమకు హద్దులు లేవు. మనసుకు సరిహద్దులు తెలియవు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడింది... స్వీడన్‌కు చెందిన ఒక మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన పవన్ కుమార్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.
Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని…