Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ డాక్టర్ అనేక మంది పేషెంట్లకు ఒకే సిరంజిని వాడాడు. ఆ తరువాత ఓ అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటాహ్ లోని ఒక వైద్య కళాశాల వైద్యులు ఒకే సిరంజితో అనేక మందికి ఉపయోగించారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా కేంద్ర ప్రకటిస్తుందని, గోవధను నిషేధిస్తుందని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉందని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, అన్ని మతాలను గౌరవించాలని, హిందూ మతంలో ఆవును దైవంగాీ భావిస్తారని, కాబట్టి ఆవును రక్షించాలి, పూజించాలని జస్టిస్ షమీమ్ అహ్మద్ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించారు.
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు
Hathras case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటన. దేశ రాజకీయాలన్నీ ఈ ఘటన చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేసు ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురిని నిర్దోషులుగా గురువారం కోర్టు ప్రకటించింది.
Umesh Pal murder case: యూపీ రాజకీయాలను ఉమేష్ పాల్ హత్య కేసు కుదిపేస్తోంది. ఇటీవల ఈ హత్యపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆ పార్టీ చీఫ్ పై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల కోసం 10 పోలీస్ టీములు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే…
Shocking: ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15ఏళ్ల క్రితం 12ఏళ్ల బాలుడు పాముకాటుతో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సరయూ నదిలో సంప్రదాయపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
NIA court convicts 8 suspected IS operatives: కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
Atrocious: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. సాంకేతికంగా ఎంతగా ముందుకు వెళ్తున్నప్పటికీ గ్రామాల్లోని అనేకమంది ఇప్పటికీ సంప్రదాయ వైద్యంపై ఆధారపడుతున్నారు.
UP Couple Kills Daughter: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు తప్పుడు తిరుగుళ్లు తిరుగుతుందని, మొబైల్ ఫోన్లతో అబ్బాయిలతో మాట్లాడుతుందని, ఆమెకు వేరే అబ్బాయితో సంబంధం ఉందని తల్లిదండ్రులే దారుణంగా ఆమెను హత్య చేశారు. కూతురు దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు దొరిగిన తర్వాత తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కౌశాంబి జిల్లా టెన్న్ షా అలమాబాద్ లో జరిగింది.