బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు.
గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు. బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి రూ.6 వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని.. ఇవి రెండు విడతలుగా చెల్లిస్తారన్నారు. రెండోసారి ఆడబిడ్డ అయితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కానీ…
Minister Uttam: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యంతో ఒక మాఫీయా నడిపిస్తున్నారు.. కేబినెట్ నిర్ణయం మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని…
Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల…
దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 - 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా…
తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా…
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్…