ఈ నెల 5 న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Saraswati Pushkaralu : కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక…
Uttam Kumar Reddy : హుజూర్నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే…
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్…
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..
నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్‌గా నాదెండ్లకు ఇవ్వాలన్నారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చించినట్లు తెలిపారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్ పోర్ట్ చేస్తున్నామని.. ఇల్లీగల్ రైస్ కట్టడి గురించి మాట్లాడినట్లు చెప్పారు. అసెట్స్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనలో…
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో ముఖ్యమైన ఇంజనీరింగ్ వారసత్వం, జలసౌధ, ప్రభుత్వ ఉద్యోగాలు, మరియు ప్రాజెక్టుల స్థితి గురించి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగుల బలోపేతం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతనంగా ఉద్యోగాలు పొందుతున్న వారికి అభినందనలు. మీరు గొప్ప ఇంజనీర్‌ల వారసత్వం పొందుతున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత రత్న…
Harish Rao : తెలంగాణలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది అంటూ హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర…
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్.. ఇక…
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.