తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అద్భుతమైన పథకం నా నియోజకవర్గం నుండే ప్రారంభం కావాలని కోరుకున్న.. ప్రస్తుతం అందుతున్న రేషన్ బియ్యం లబ్ధిదారులు తినడం లేదు.. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. 84 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయని తెలిపారు.
Also Read:Earthquake: టోంగా దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
గత ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన చోటే రేషన్ కార్డులు ఇచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ.. రెండు రకాల రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.. BPL కింద ఉన్న వాళ్లకు వైట్ కార్డ్.. BPL కు ఎగువన ఉన్న వారికి గ్రీన్ కార్డు ఇస్తాం.. ఆహార భద్రత చట్టం పకడ్బందిగా అమలు చేస్తామని తెలిపారు.