Uttam Kumar Reddy : శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు…
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. దోమలపెంటలోని జె.పి గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట…
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ..ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టు ల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణ కు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్…
తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కృష్ణా జలాల విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ WP1230/2023 నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వాదులతో కలిసి విచారణకు…
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని…
Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…
TG Congress Delhi Tour: తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతున్నారు. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన…
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం…