Off The Record : ఆ ఉమ్మడి జిల్లాలో నీటి పోటీలు జరుగుతున్నాయా? క్రెడిట్ రేస్‌లో ముగ్గురు మంత్రులు పోటీలు పడుతున్నారా? ఒకరు ముందు, మరో ఇద్దరు కాస్త వెనకగా నీళ్ళు విడుదల చేయించి తమ ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నారా? ఎవరా మంత్రులు? ఏంటా క్రెడిట్ వార్? ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలాలకు సాగునీరు ఇచ్చే విషయంలో మంత్రుల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
ఈరోజు ( జూన్ 28న ) జూరాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని తెగిపోయిన నాలుగు గేట్ల రోప్‌లను పరిశీలించనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ…
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. కొన్ని ముఖ్య శాఖలకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష. నేడు ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో మంత్రి ఉత్తమ్ సమావేశం. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అఖిలపక్ష ఎంపీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్‌తో పాటు పాల్గొననున్న ఆల్ పార్టీ ఎంపీలు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు బీజేపీ, BRS ఎంపీలకు లేఖ రాసిన మంత్రి…
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు…
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి…
కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల…
Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత…