సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద మరింత వ్యతిరేకత ఉంది.. ఎమ్మెల్యేలు నియంతలా.. సామంత రాజులు అనుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.. ప్రభుత్వం వ్యతిరేక అంశాలు అన్ని జనంలోకి వెళ్ళాలి అని నల్గొండ ఎంపీ తెలిపారు.. ఎంత కష్టపడితే అంత మంచిది.. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకానున్నారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా సాగు నీరు అందించారా అని ఆయన ప్రశ్నించారు.