వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా సాగు నీరు అందించారా అని ఆయన ప్రశ్నించారు. నెల్లికలు లిఫ్ట్ ఏడాదిలో పూర్తి చేస్తామనీ అన్నారు.. పూర్తికాకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన జగదీష్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తారు అంటూ ఉత్తమ్ అడిగారు.
Also Read : Rajinikanth: బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు.. అది ఎవరి వలన కాదు
మిషన్ భగీరథ నీళ్లు గ్రామాల్లో ప్రజలకు అనడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 1200 మంది యువత బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో భారీగా నిరుద్యోగ సమస్య పెరిగింది అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read : Tiger: 110 ఏళ్ల తరువాత ఆ రాష్ట్రంలో కనిపించిన పులి..
బీఆర్ఎస్ పార్టీ అవినీతికి, నిర్లక్ష్యానికి పేపర్ లీకేజీ పరాకాష్ట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని వెంటనే పూర్తి చేయాలి.. నిరుద్యోగ నిరసన ర్యాలీ ద్వారా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం.. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడికే హక్కు లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.