MLA Jagga Reddy: ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని భువనగిరి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకానున్నారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిర్వహణ ఆషామాషి కాదని అన్నారు. సభలు, సమావేశాలు హడావుడి మామూలే అని తెలిపారు. వాస్తవరూపంలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఇప్పటివరకైతే అలాంటిది జురుగుతున్నట్లుగా లేదని అన్నారు. తెలంగాణలో ఎన్నికలంటే, 20 కోట్లా, 30 కోట్లా అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలలో ఉన్న లోపాలు, జరుగుతున్న పొరపాట్లు, జరగబోయే నష్టం రాహుల్ గాందీకీ నేరుగా చెప్తానని అన్నారు. ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేద్దామనుకున్న పనులను కూడా చేయలేమని అన్నారు. ఇప్పటికే నష్టం జరిగిందని తెలిపారు. జైపాల్ రెడ్డి మేధావులందరూ కలిసి రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంత నష్టం చేశారని ఆరోపించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపురావడంతో.. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం 21 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే టీపీసీసీ సమీక్షా సమావేశంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..