Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Bombay High Court: బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యాయ్ ప్రమాణ స్వీకారం
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
అవి పూర్తిగా అబద్ధం.. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా.. 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి.. వరుసగా 6 ఎన్నికల్లో గెలిచినందుకు గర్విస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ అన్నారు. నా భార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం ఆమె పనిచేస్తున్నారని టీపీసీసీ మాజీ చీఫ్ తెలిపారు.
Read Also: Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
మాకు పిల్లలు లేరు. అత్యంత నిబద్ధతతో ప్రజా జీవితంలో 365 రోజులు పని చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరువు నష్టం కలిగించే వార్తలు రాసి మమల్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమైనది.. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నాడు. నేను పార్టీలో కొన్ని పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు.. కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తాను అని ఆయన చెప్పాడు. పార్టీ అంతర్గత విషయాల గురించి ఎప్పుడు బయట మాట్లాడను అని ఉత్తమ్ తెలిపాడు.
Read Also: Onions: ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో..!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి.చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు లేదా మాట్లాడలేదు అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నాను.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేశా.. ఆ తరువాత రాష్ట్రపతి వెంకటరామన్, ప్రెసిడెంట్ ఎస్‌డీ దగ్గర సీనియర్ అధికారిగా కూడా పనిచేశాను అని ఉత్తమ్ తెలిపారు. యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!