TS Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే వారి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం కుదించింది. తొలుత 20 మందికి పైగా నేతలను ఆహ్వానించినట్లు సమాచారం అందినప్పటికీ.. ఈ సమావేశంలో పాల్గొన్న వారి సంఖ్య 15 మందికి మాత్రమే పరిమితమైంది. ఆ జాబితాను పరిశీలిస్తే.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణికరావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, పీసీ విష్ణునాథ్ పేర్లు ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సీనియర్ నేత వీ.హనుమంతరావుకు కూడా ఆహ్వానం అందింది.
Read also: Etela Rajender: మీడియా ముందుకు ఈటల దంపతులు..! సంగతి ఏంటి?
అయితే వ్యూహ కమిటీకి ఆహ్వానం అందకపోవడంపై కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆహ్వానం అందని టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మండిపడుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఖర్గే, రాహుల్, ప్రియాంక రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ప్రజలకు కాంగ్రెస్ ఇస్తున్న హామీలపై కూడా ఈ ఇంటర్వ్యూలో చర్చ జరగనుంది. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రజలకు కూడా ఐదు హామీలను అందించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
CM KCR: సీఎం కేసీఆర్ కు శ్రీవిట్టల్ రుక్మణి విగ్రహాన్ని బహూకరించిన భక్తుడు