సమర్ డియాజ్ అనే 24 ఏళ్ల మహిళ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గాయం తీవ్రం కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు తీవ్రంగా శ్రమించి వైద్యం అందించారు. రెండు వారాల తరువాత ఆమె కోమానుంచి కోలుకున్నది. సాధారణంగా కోమాలోకి వెళ్తే గతాన్ని మర్చిపోతారు. వివిధ థెరిపీల ద్వారా గతం గుర్తుకు వస్తుంది. కొంతమంది మాట మర్చిపోతే స్పీచ్ థెరిపీ ద్వారా మాట తెప్పిస్తుంటారు. అయితే సమర్ డియాజ్ విషయంలో అన్నింటికి మించి జరిగింది. …
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆహారం లేక లక్షలాది మంది ప్రజలు అలమటిస్తున్నారు. మానవతా దృక్పధంలో కొన్ని దేశాలు ఆహారం వంటివి సరఫరా చేస్తున్నా, అవి కొంత వరకు మాత్రమే సరిపోతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏ ప్రపంచ దేశం కూడా అధికారికంగా గుర్తించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్టుగా తాలిబన్లు అక్కడి ప్రజలపై కఠినమైన చట్టాలు అమలు చేస్తూ మరిన్ని బాధలు పెడుతున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఫ్రీజ్…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. 12 ఏళ్లకు పైబడిన వారికి అక్కడ వ్యాక్సిన్ ఇప్పటికే అందిస్తున్నారు. కాగా 5-11 ఏళ్ల వయసున్న చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఫైజర్ ఎన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్నారుల ఫైజర్ టీకాకు ఎఫ్డీఎ అనుమతులు మంజూరు చేసింది. Read: వైరల్: మృగాడి నుంచి కుక్కను కాపాడిన గోమాత… దీంతో ఈ…
కరోనా మహమ్మారి విషయంలో వీలు దొరికినప్పుడల్లా చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ చైనాపై చాలా విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్ అని, బయోవెపన్ అని విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిశోధకులను వూహాన్లోకి అడుగుపెట్టనివ్వడం లేదని, వూహాన్ ల్యాబోరేటరీలో వైరస్‌ను తయారు చేసి అక్కడి నుంచి లీక్ చేశారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో చైనా మండిపడింది. ఎన్నికల సమయంలో కాస్త…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభత్వం ఏర్పాటయ్యి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించక ముందే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పాక్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ప్రస్తుతం ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వం కూలిపోయిన వెంటనే అంతర్జాతీయంగా ఆ దేశానికి…
అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు తమను తమ ప్రభుత్వాలను గుర్తించాలని లేదంటే మొదటికే మోసం వస్తోందని పరోక్షంగా హెచ్చరిచారు.తమను గుర్తించకుండా విదేశి నిధులు, విదేశి బ్యాంకు ఖాతాలను నిలిపి వేస్తే సమస్యలు ఒక్క ఆప్ఘాన్ కే పరిమితం కావాన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సరికదా అమెరికా, ఐరోపా దేశాలు ఆప్గాన్‌కు నిధులను స్తంభింపజేశాయి. దీంతో ఆప్గాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి…
అమెరికాతో సహా పలు దేశాలు చైనాను హెచ్చరిస్తున్నప్పటికీ తైవాన్ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. తైవాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేదని, ఆ దేశం చైనాలో కలిసిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ జీ 20 దేశాల సదస్సులో ఈ విషయాన్ని తెలియజేశారు. వన్ చైనాను 50 ఏళ్ల క్రితమే అమెరికా అడ్డుకోలేకపోయిందని, ఈ విషయంలో ఎవరు అడ్డు తగలాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా…
ఐస్‌క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్లను తయారు చేస్తుంటాయి. అన్ని కంపెనీలలోకి బెన్ అండ్ జెర్రీ కంపెనీ వేరుగా ఉంటుంది. యూఎస్‌లోని వెర్మెంట్లో వాటర్బర్నీ అనే గ్రామంలో 1978లో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను స్థాపించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను తయారు చేసేవారు. వినియోగదారులకు నచ్చని ఐస్‌క్రీమ్‌లకు వాటి ఫ్లేవర్ల రూపంలోనే పార్లర్సమీపంలో సమాధి చేసేవారు. సమాధిపై ఆ ఐస్‌క్రీమ్‌ను…
ఇప్పటి వరకు పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒకటి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివశించే సింథియా తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించేది. ముఖ్యంగా ఆమె తండ్రి అంటే అమితమైన గౌరవం ఉన్నది. తనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ, పెద్దగా ఎవర్ని కలిసేది కాదు. అప్పుడప్పుడు తన తండ్రికి తెలియకుండా తన బాయ్‌ఫ్రెండ్ ను కలుస్తూ ఉండేది. 1981లో ఒహియోలోని టోలెడోలో లీగల్…
తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. జియాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయింది. ఆర్ధిక, సైనిక శక్తిని పెంచుకున్నది. తన దేశాన్ని విస్తరించుకోవాలని చైనా చూస్తున్నది. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లో రోడ్డు, భవనాలు, ఇతర మౌళిక వసతుల నిర్మాణాల ఏర్పాటు పేరుతో ప్రవేశిస్తు అక్కడ బలాన్ని పెంచుకొని ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది చైనా. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వాటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పుడు తన…