కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. విమానాలను నడపడం ఇబ్బందిగా మారడంతో కొన్ని సంస్థలు ఇప్పటికే మూసేశాయి. ఇంధనం ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కష్టతర సమయంలో భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది ఓ శుభవార్తను చెప్పారు. బ్రాసికా కెరినాటా అనే ఓ రకమైన ఆవాల మొక్క నుంచి తీసిన నూనె నుంచి విమానాల్లో వినియోగించే ఇంధనాన్ని తయారు చేయవచ్చని పునీత్ బృందం తెలియజేసింది. ఇలా తయారు చేసిన ఇంధనం ద్వారా వెలువడే కర్భన ఉద్గారాలు…
బోర్డర్‌లో నిత్యం పహారా కాసే సైనికులు కబడ్డీ అడుతూ కనిపించారు. భారత్, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని అలస్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్15 నుంచి 29 వరకు ఈ విన్యాసాలు జురుగుతాయి. ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, వీరి మధ్య మంచి వాతావరణం నెలకొల్పేందుకు వివిధ రకాల క్రీఢలను…
కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ కారణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మహమ్మారులకు వ్యాక్సన్‌ను తయారు చేయాలి అంటే కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. కానీ, కరోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది. ఆరునెలల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత…
చైనా మరోసారి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ సరికోత్త హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి భూకక్ష్యకు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే, చైనా ప్రయోగించిన ఈ క్షిపణి కొద్దిలో గురితప్పినప్పటికీ, అమెరికా కన్నుగప్పి ఈ క్షిపణిని ప్రయోగించింది. భూకక్ష్యకు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావడం అంటే మాములు విషయం కాదు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా మీద నుంచి కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు.…
అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్షల విషయంపై ఆలోచిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర కొరియా మండిపడుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కిమ్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల…
దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశం ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ జలాల పరిధిలోని దీవులు, దేశాలు తమవే అని వాదిస్తోంది. తైవాన్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తైవాన్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆ దేశానికి సమీపంలో గువామ్ నావికాదళాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ఈ జలాల్లో పహారా కాస్తుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాటీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది.…
దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటినుంచో తైవాన్‌పై కన్నేసిన చైనా ఇప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ బోర్డర్ వరకు వెళ్లి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 30 యుద్దవిమానాలు తైవాన్ బొర్డర్లో ఎగురుతూ కనిపించాయి. కాగా, తాజాగా 52 యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించినట్టు తైవాన్ రక్షణశాఖ మంత్రి తెలిపారు.…
అమెరికాకు చెందిన ఇద్దరు వైద్యశాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యూరీ. శరీరంపై ఉష్ణగ్రాహకాలు, స్పర్శ అనే అంశంపై ఇద్దరూ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. నిత్య జీవితంలో శరీరంపై ఉష్ణగ్రాహకాల ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంటామని, కానీ, మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, స్పర్శ, చలి వంటివి ఎలా ప్రారంభం అవుతాయి, వాటికి నాడులు ఎలా స్పందిస్తాయి అనే వాటిని డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లు సమాధానం కనుగోన్నారని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. వీరి పరిశోధనలను గుర్తించిన జ్యూరీ సభ్యులు…
ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. పరిమితికి మించి యూరేనియం నిల్వలను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. కాగా, ఆంక్షల కారణంగా నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలని, ఆ తరువాతే అణు ఒప్పందంపై చర్చలు జరపాలని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాలని ఇరాన్ పేర్కొన్నది. 2018 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…