ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాల్లో న్యూయార్క్ కూడా ఒకటి. అక్కడ జీవించాలంటే ఒక వ్యక్తి సగటు వ్యయం 1341 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం లక్ష రూపాయలు. నెలకు ఇంత ఖర్చు అంటే మనం నోరెళ్లబెడతాం. ఎంత తగ్గించుకున్నా కనీసం వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఓ మహిళ మాత్రం కేవలం నెలకు 200 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ జీవనాన్ని సాగిస్తోంది. అంత ఖరీదైన నగంలో మరీ అంత తక్కువ ఖర్చుతో…
సాధారణంగా కంపెనీ లాభాల బాట పడితే అందులో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేటు సంస్థలు బోనస్‌లు ఇస్తుంటారు. కంపెనీ కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులకు వారి జీతాలను అనుసరించి బోనస్‌లు ప్రకటిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ అనే లేడీ బాస్ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అద్భుతమైన కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రపంచంలో ఉద్యోగులు ఎక్కడికైనా వెళ్లి వచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు, ఖర్చుల కోసం రూ.7.5 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తప్పుకున్నాక ఆ దేశంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలు మళ్లీ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు చేస్తున్నది. ఇటీవలే రెండు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గుర్తించక పోవడంతో ఆ దేశంలో ఉగ్రసంస్థల బలం పెరిగే అవకాశం ఉందని, ఇది ఆఫ్ఘన్ దేశానికి మాత్రమే కాకుండా…
మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకొకముందే మరలా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, రెండు డోసులు తీసుకున్నప్పటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా వస్తుండటంతో ప్రజల్లో ఆందోళనల మొదలైంది. ఇక, కరోనా సమయంలో అమెరికా ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇక, ఇదిలా ఉంటే, అంతర్జాతీయ ప్రయాణాల ఆంక్షలను ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం సడలించింది. అంతర్జాతీయంగా కేసులు…
గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి.…
గత కొంతకాలంగా చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ తమ భూభాగంలో భాగమే అని, తప్పని సరిగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెబుతూ వస్తున్నది. కొన్ని రోజులుగా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా జెట్ విమానాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే, తైవాన్‌పై డ్రాగన్ దాడిచేస్తే తైవాన్‌కు అండగా పోరాటం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ…
అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (CDC) తేల్చింది. అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని CDC డేటా తెలిపింది. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే నిజానికి సెప్టెంబరు నెల మధ్యలోనే…
దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా చూస్తున్నది. దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్‌పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా, తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధికారులు తెలిపారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వియాత్నం, ఫిలిప్పిన్స్‌తో పాటుగా జపాన్,…
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్…
అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌ను ఫేస్బుక్, ట్విట్టర్లు బహిష్కరించాయి. గత 9 నెలల కాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కాగా, ట్రూత్ సోషల్ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని, అలాంటి ప్రపంచంలోనే మనమూ ఉన్నామని, ట్విటర్లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది…