సమర్ డియాజ్ అనే 24 ఏళ్ల మహిళ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గాయం తీవ్రం కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు తీవ్రంగా శ్రమించి వైద్యం అందించారు. రెండు వారాల తరువాత ఆమె కోమానుంచి కోలుకున్నది. సాధారణంగా కోమాలోకి వెళ్తే గతాన్ని మర్చిపోతారు. వివిధ థెరిపీల ద్వారా గతం గుర్తుకు వస్తుంది. కొంతమంది మాట మర్చిపోతే స్పీచ్ థెరిపీ ద్వారా మాట తెప్పిస్తుంటారు. అయితే సమర్ డియాజ్ విషయంలో అన్నింటికి మించి జరిగింది. కోమానుంచి బయటకు వచ్చిన సమర్‌కు థెరపీ ఇప్పించారు.
Read: కార్లకోసం సరికొత్త పవర్ బ్యాంక్…
అవేమి ఆమెకు పనిచేయలేదు. పైగా కోలుకున్నాక సమర్ మాతృభాషకు బదులుగా అసలు సంబంధంలేని కొత్త భాషను మాట్లాడటం మొదలుపెట్టింది. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. సమర్ న్యూజిలాండ్ లోని ట్రైబల్ బాషను మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఆమె న్యూజిలాండ్ వెళ్లలేదని, ఆ ట్రైబల్ భాష గురించి ఆమెకు తెలియదని, కానీ, కోమా నుంచి కోలుకున్నాక న్యూజిలాండ్ ట్రైబల్ భాషను మాట్లడటం వింతగా అనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యపరిభాషలో దీనిని ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.