కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒమిక్రాన్ రాకతో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది యూఎస్‌లో అత్యధిక సంఖ్యలో రెండు లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఒక్కరోజులో 4 నుంచి 5 లక్షల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల పెరుగుదల కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఆసుపత్రుల్లో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి.
Read: ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్రమాదం తప్పదా?
మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతాయని, మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌసీ పేర్కొన్నారు. దేశంలో 73 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 36.3 శాతం మందికి ఇప్పటికే బూస్టర్ డోస్ అందించారు. అయినప్పటికీ రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే తీసుకోని వారికే ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కేసులు పెరుగుతున్నా, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని, జాగ్రత్తలు తీసుకుంటే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని వైద్యనిపుణులు పేర్కొన్నారు.