భారత్ కు చెందిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్ ను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు బుధవారం రోజున పూర్తి చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి విప్రో లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 మార్చి 31 తో లీన్ స్విఫ్ట్ పూర్తిగా విప్రోలో విలీనం అవుతుంది. యూఎస్, స్వీడన్, భారత్ లో లీన్‌స్విఫ్ట్ కంపెనీ కార్యాలయాలను కలిగి యుంది. పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్, ఆహారం, పానియాలు తదితర రంగాల్లో లీన్‌స్విఫ్ట్ విస్తరించి ఉంది. లీన్ స్విఫ్ట్ పూర్తిగా విప్రోలోకి విలీనం అయ్యాక విప్రో సేవలను మరింత విస్తృతంగా వ్యాపింపజేసే అవకాశం ఉంది.
Read: ఆ టీవీ స్టార్ అభిమానుల కోసం దాన్ని అమ్మి కోట్లు సంపాదిస్తుంది…