Chinese rocket reenters atmosphere over Indian Ocean: ప్రపంచాన్ని కలవరపెడుతున్న చైనా రాకెట్ ఎలాంటి నియంత్రణ లేకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు యూఎస్ఏ ధ్రువీకరించింది. తూర్పు కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు యూఎస్ స్పెస్ కమాండ్ శనివారం వెల్లడించింది.
Bloomberg survey On Recession: కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిర పరిచాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాాలను ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక మాంద్యంపై బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో రానున్నటువంటి ఆర్థికమాంద్యం గురించి బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాల గురించి ప్రస్తావించారు.
Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.
అమెరికాలో మంకీపాక్స్ వ్యాధిని మొదటిసారిగా పిల్లల్లో గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఇద్దరు పసిపిల్లలకు మంకీపాక్స్ సోకిందని యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ రెండు మంకీపాక్స్ కేసులు గృహ ప్రసారం ఫలితంగా ప్రబలి ఉండవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా అమెరికా చుట్టేస్తోంది. చికాగో, న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఫోరిడాలో సేదతీరుతోంది. ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో సోదరుడు గుర్ఫతేతో కలిసి విహరిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింగిల్-పీస్ స్విమ్‌సూట్‌లో యాచ్‌లో డ్యాన్స్ చేయడమే కాదు అట్లాంటిక్ సముద్రంలో అలలపై తేలుతూ ఈత కొట్టేస్తోంది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినా అది అమ్మడికి ఎంత మాత్రం ప్లస్ కాలేదు. ఆ తర్వాత అమ్మడి ఖాతాలో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం మరణించినట్లు ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్ లోని ఇంట్లో మరణించింది ఇవానా ట్రంప్. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ‘‘ ఆమె అద్భుతమైన వ్యక్తి, అందమైన మహిళ.. ఆమె గొప్పగా స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది.. రెస్ట్ ఇన్ పీస్ ఇవానా’’ అని ట్రంప్ కామెంట్ చేశారు. Read Also: Instagram:…
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్,…