Russia: 2028లో రష్యా కొత్త స్పేస్ స్టేషన్.. అప్పటి వరకు నాసాతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ను కలవరానికి గురిచేసింది. అయితే 2028లో రష్యా సొంతంగా ‘రోస్’ అనే పేరుతో అంతరిక్షంలో ఓ కొత్త స్పేస్ ఔట్ పోస్టును నిర్మించాలని అనుకుంటోంది. అప్పటి వరకు ఐఎస్ఎస్ లో భాగంగా ఉండాలని రష్యా అధికారులు తమకు తెలిపారని నాసా సీనియర్ అధికారి వెల్లడించారు. రోస్కో స్మోస్ తో నాసా సంబంధాలు ఎప్పటిలాగానే ఉంటాయని నాసా అధికారి వెల్లడించారు.
Read Also: America: అగ్రరాజ్యం అమెరికాలో ‘టాప్’ స్టార్టప్ హీరోలూ మనోళ్లే
Also Read
అంతరిక్ష పరిశోధనల కోసం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు. రష్యా, అమెరికాతో పాటు కెనడా, జపాన్ వంటి దేశాలతో పాటు 11 యూరోపియన్ దేశాలు ఐఎస్ఎస్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. రెండు దశాబ్ధాలుగా ఐఎఎస్ సేవలను అందిస్తోంది. అయతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తరువాత పరిస్థితులు మారాయి. బద్ధ శత్రువులుగా ఉన్న రష్యా, అమెరికాలు అంతరిక్ష రంగంలో కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా 2024 తరువాత ఐఎస్ఎస్ నుంచి ఉపసంహరించుకుంటామని రష్యా ప్రకటించింది. రష్యా, అమెరికా సాంకేతికతల ఆధారంగా ప్రస్తుతం ఐఎస్ఎస్ పనిచేస్తోంది.
- Tags
- ISS
- nasa
- Russia
- Russia-Ukraine War
- USA
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!