Lightning Strike:: అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. తమ 56వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వృద్ధ జంటతో సహా ముగ్గురు వ్యక్తులు శుక్రవారం వైట్‌హౌస్ సమీపంలోని పార్కులో పిడుగుపాటుకు గురై మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మరొకరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న లఫాయెట్ పార్క్‌లో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చెంతనే పిడుగు పడిందని అధికారులు శుక్రవారం తెలిపారు. వీరిలో ఒక మహిళ, పురుషుడు మరణించగా, మరో మహిళ, పురుషుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి మృతి వైట్ హౌస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు. ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్న వారి కోసం తాము ప్రార్థిస్తున్నామమని ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిడుగుపాటు అనంతరం అక్కడకు చేరుకున్న సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముందుజాగ్రత్తగా పార్క్‌లో కొంత భాగాన్ని అధికారులు గంటసేపు మూసివేశారు. బాధితులు పార్క్‌లోని ఒక చెట్టు కింద తుఫాను నుండి ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. వర్షం పడే సమయంలో చెట్లు సురక్షితమైన ప్రదేశాలు కాదని ఓ అధికారి వెల్లడించారు.
Andhra Girl Married American Guy: ఖండాంతరాలు దాటిన ప్రేమ… అమెరికా అబ్బాయితో తిరుపతి యువతి పెళ్లి..
భారీ అగ్నిప్రమాదం: అమెరికా పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని.. వారి వయసు వరుసగా 5, 6, 7 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇంట్లో మొత్తం 14 మంది ఉండగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.