అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్‌పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్ పేర్కొంది. జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్…
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో, అరబ్ దేశాల్లో దుమారమే రేపాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఖతార్, మలేషియా, సౌదీ అరేబియా, ఇరాన్ మొదలైన అరబ్ దేశాలు భారత్ కు నిరసన తెలిపాాయి. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. వ్యక్తిగత వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించకూడదని ఇతర దేశాలకు సూచించింది. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలతో ఇండియాలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీ, పశ్చిమ…
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా గురువారం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని…
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ…
భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపికైంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. దీన్ని 2009లో ప్రారంభించారు. భారతీయ స్నాక్స్‌ను ఈ రెస్టారెంట్ అందుబాటు ధరల్లోనే అందించడం ప్రత్యేకత. చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.. అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా చాయ్ పానీని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి…
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్ను…
మూడు నెలలు గుడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి రావడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతం అయిన డాన్ బోస్ ప్రాంతంలో రష్యా తన దాడిని పెంచింది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా, ఖార్కివ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను ధ్వంసం చేసింది రష్యన్ ఆర్మీ. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని 20 శాతం భూమి ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్…
మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యాను నిలువరించారు. దీంతో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఎన్నో ఏళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు మార్చి 25 న ఒక కానుకగా ఈ సినిమాను ఇచ్చేశాడు జక్కన్న.. ఇక ఈ సినిమా విడుదలై మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అక్కడ ఇక్కడ అని…