USA should be ready to stop Chinese invasion says US Official: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చైనా కూడా తైవాన్ ద్వీపాన్ని ఎప్పుడైనా ఆక్రమించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షడు జిన్ పింగ్, తైవాన్ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. చైనా సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే చూస్తు ఊరుకోం అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే చైనాకు వ్యతిరేకంగా తైవాన్ దేశాన్ని రక్షించేందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని అమెరికా సీనియర్ అధికారి సూచించారు.
తైవాన్‌పై చైనా దండయాత్రను నివారించేందుకు యూఎస్ మిలిటరీ సిద్ధంగా ఉండాలని.. సీనియర్ అడ్మిరల్ బుధవారం అన్నారు. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా చూస్తోందని ఆయన అన్నారు. యూఎస్ నేవీ చీఫ్ అడ్మినర్ మైఖైల్ గిల్డే మాట్లాడుతూ.. చైనాను స్వాధీనం చేసుకునేందుకు అనుకున్నదాని కన్నా దుందుడుకుగా చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Somu Veerraju: ఏపీలో రాహుల్ పాదయాత్రపై బీజేపీ అభ్యంతరం
మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు జిన్ పింగ్ ఉవ్విళ్లూరుతున్నారు. సొంతదేశం చైనాలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. మూడో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఆదివారం రోజు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ లో ప్రసంగిస్తూ.. ఏదో ఒక రోజు తైవాన్ ను బలవంతంగా తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. 2027 నాటికి చైనా, తైవాన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధికారులు అనుకుంటున్నప్పటికీ.. 2023లోనే చైనా, తైవాన్ స్వాధీనం చేసుకునేందు ప్లాన్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ లైవాన్ ద్వీపాన్ని ఎన్నటికీ నియంత్రించలేదని.. తైవాన్, అమెరికాకు మిత్రుడని అమెరికా అధికారులు అన్నారు. ఇదిలా ఉంటే తైవాన్ ను చైనా కవ్విస్తోంది. గతేడాదిగా తైవాన్ భూభాగానికి సమీపంలోకి తన యుద్ధ నౌకలను పంపిస్తోంది. చాలా సార్లు పీపుల్స్ లిబరేష్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలంలోకి దూసుకెళ్లి ఉద్రిక్తతలను పెంచాయి.