BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇటు భారత్, అటు యూకేలు స్పందించాయి. వలసవాద మనస్తత్వంగా ఈ డాక్యుమెంటరీని అభివర్ణించింది భారత ప్రభుత్వం. మరోవైపు ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇక యూకేలో దీనిపై ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు డాక్యుమెంటరీని సమర్థించగా.. మరికొందరు ప్రధాని మోదీకి మద్దతు పలికారు.
Read Also: Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక అలా చేస్తే రీయింబర్స్‌మెంట్
ఈ వివాదంపై అమెరికా కూడా స్పందించింది. ఇటీవల అమెరికా ప్రతినిధి నెడ్ ప్రైడ్ ను ఈ డాక్యుమెంటరీ గురించి తెలియదని అన్నారు. అయితే తాజాగా భారత్ ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేయడంపై స్పందించింది. దీన్ని పత్రికా స్వేచ్ఛగా సంబంధించిన అంశంగా అభివర్ణించింది అమెరికా విదేశాంగ శాఖ. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా పత్రికా ప్రాముఖ్యతను సమర్ధిస్తామని భావప్రకటనా స్వేచ్ఛ, మతం, విశ్వాసం వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను, మానవ హక్కులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
అంతకుముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ప్రధాని మోదీని సమర్థించారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్ హుస్సెన్ యూకే పార్లమెంట్ లో ఈ డాక్యుమెంటరీపై చర్చను లేవనెత్తారు. 2002 గుజారాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ ఆరోపించారు. దీనిపై యూకే వైఖరి ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే పలువురు బ్రిటన్ ఎంపీలు నరేంద్రమోదీకి మద్దతు పలిచారు. భూమిపై శక్తివంతమైన వ్యక్తుల్లో మోదీ ఒకరని కొనియాడారు.