Taiwan Says China Deployed 71 Warplanes In Weekend War Drills: జిత్తులమారి చైనా, తైవాన్ పైకి కాలుదువ్వుతోంది. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో డ్రాగన్ కంట్రీ పావులు కదుపుతోంది. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. తాజాగా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాల పేరుతో చైనా తన యుద్ధవిమానాలను మోహరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
Joe Biden Nominates Indian-American Richard Verma For Top Diplomatic Post: భారతీయ అమెరికన్లు వ్యాపారాలు, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా సిలికాన్ వ్యాలీని భారత టెక్కీలు ఏలుతున్నారు. నాసా మొదలుకుని వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో భారతీయులు, భారత-అమెరికన్లు సత్తా చాటుతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు భారతీయ మూలాలు ఉన్న వారు ప్రధానులుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ అధికారంలో ఉన్న భారతీయ- అమెరికన్లకు కీలక పదవులు…
Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్…
Russia's Zircon Hypersonic Missile: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు తన దేశం సర్వనాశనం అవుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని ఆపి, రష్యాతో చర్చలకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మరన్ని ఆయుధాలు కావాలంటూ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అమ్ముల పొదిలో అధునాతన క్షిపణి చేరినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచంలో సాటి…
Russia Says No Chance Of Peace Talks As Zelenskiy Travels To Washington: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కావడంతో పాటు కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే జెలన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. బుధవారం జెలన్ స్కీ వాషింగ్టన్ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉక్రెయిన్…
Russia Says Shot Down 4 US-Made Missiles, 1st Such Claim Since Ukraine War: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యా ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇక ఉక్రెయిన్ కూడా వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంలో రష్యాతో పోరాడుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశం సర్వనాశనం అవుతోంది. రష్యా, అమెరికాల వివాదం మధ్య ఉక్రెయిన్ యుద్ధ భూమిగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు.…
US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు.…