డాలర్లు సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన వారికి గట్టి షాక్ తగులుతోంది. డొలాల్డ్ ట్రంప్ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలన చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా ప్రభుత్వం. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న భారతీయులను సైతం వెనక్కి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది భారతీయులను వెనక్కి పంపింది. 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి బయల్దేరిన ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్…
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గత వారం రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలో హెలికాఫ్టర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. ఆ తర్వాత మరో చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రన్ వేపై టేకాఫ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. కానీ,…
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.
Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది.
America : అమెరికాలో కొంతకాలంగా మంటలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మంటలు పెరుగుతున్నాయి.. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించబడ్డారు.
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు.
ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు.
America- India: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.