Telugu Girl Susroonya Koduru health Critical: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద పిడుగుపాటుకు గురై అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడింది. శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువు వద్ద షికారు చేస్తుండగా పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై సుస్రూణ్య గాయపడి పక్కనే ఉన్న ఒక చెరువులో…
అమెరికాలోని కెంటుకీలో ఓ వ్యక్తి తన మొక్కజొన్న పొలంలో అంతర్యుద్ధ కాలం నాటి 700 అరుదైన బంగారు డాలర్లను కనుగొన్నాడు. వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటుందని అంచనా. కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా.. ఆటంకం ఏర్పడింది.
Sukumar daughter to take music course in USA: ఒకప్పుడు లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ చేసిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడమే కాక ఇండియా వైడ్ గా మంచి వసూళ్లు కూడా రాబట్టడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. దానిని మించి అనేలా ఈ రెండో భాగాన్ని తెరకెక్కించే…
Find A Husband: అమెరికాకు చెందిన ఓ మహిళ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తనకు భర్తను వెతికిపెడితే 5000 డాలర్లు అంటే రూ.5 లక్షలు ఇస్తా అని ప్రకటించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ లాయర్ టిల్లీ కొల్సన్ తనకు వివాహం చేసుకునేందుకు భర్తను వెతకాలని టిక్‌టాక్‌లో కోరింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.
మెడ్ మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Med Manor Organics Private Limited) పలు రకాల హెల్త్ ప్రోడక్స్ అందిస్తోంది.. ఇప్పటికే మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ఆయిల్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ క్రీమ్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ స్ప్రే లాంటివి అందిస్తుండగా.. తాజాగా, (My Dr Headache roll-on) మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్‌ను లాంచ్ చేసింది.. దీనికి సంబంధించిన యాడ్.. జూన్ 30వ తేదీన టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు.
Gurpatwant Singh Pannun: కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు.
USA: అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.