Viral Video: చిన్న కారులో పెద్ద ఎద్దు.. వాహనం ఆపి అసలు విషయం తెలుసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral video: అమెరికాలోని నార్ ఫోక్ పోలీసులకు ఉదయం 10 గంటల సమయంలో ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి ఎద్దును తన ప్యాసింజర్ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతున్నాడు అని. అయితే పోలీసులు మొదట అది ఎద్దు కాదు దూడ ఏమో అందులో కారులో సరిపోయిందేమో అనుకున్నారు. అయితే కొంత దూరం తరువాత ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు కారులో పొడవైన కొమ్ములతో ఉన్న ఓ భారీ ఎద్దును చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Panneerselvam: పన్నీర్ సెల్వంకు షాక్.. 11 ఏళ్ల తర్వాత ఆ కేసు పునర్విచారణ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ వీడియోను పరిశీలిస్తే ఓ వ్యక్తి ఒక చిన్న కారులో ఒక పెద్ద ఎద్దును ఎక్కించుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక అది చూసిన పోలీసులు అతని కారును ఆపి దాని గురించి ఎంక్వైరీ చేయడం మనం గమనించవచ్చు. రోడ్డుపై ఎద్దును తీసుకువెళుతున్న వ్యక్తి పేరు లీ మేయర్. అతడు చాలా కాలంగా ఆ ఎద్దును పెంచుకుంటున్నాడు. దానిని ప్రతి రోజు కారులో ఎక్కించుకొని వాళ్ల గ్రౌండ్ లోనే తిప్పుతాడు. ఆ ఎద్దుపేరు హౌడీ డూడీ. అయితే హౌడీని తొలిసారి రోడ్డుపై తిప్పాడు. దాని కోసం కారును ప్రత్యేకంగా రూపొందించాడు. హౌడీ కారులో చాలా చక్కగా కూర్చుంది. దాని కొమ్ములు కారులో నుంచి బయటకు వచ్చాయి. వీడియో చూస్తుంటే అది దాని ముఖాన్ని కూడా బయట పెట్టి చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎద్దును బయటకు తీసుకురావడంతో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపి ట్రాఫిక్ ఉల్లంఘనల విషయమై వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కారులో దూసుకెళ్తున్న ఎద్దును చూసి తాము ఆశ్చర్యపోయామని పోలీస్ అధికారి తెలిపారు.
ఇక హూడీ విషయానికి వస్తే అది వాటుసి జాతికి చెందిన ఎద్దు. వాటుసి ఎద్దులు ఒక రకమైన ఆఫ్రికన్ పశువులు. సాధారణంగా ఇవి చాలా పెద్ద కొమ్ములను కలిగి ఉండి, గంభీరంగా కనిపిస్తాయి. చూస్తేనే భయం పుట్టేలా ఉంటాయి. అయితే హూడీ బయటకు వచ్చిన ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి చేరుకుంది. దీనిపై లీ మేయర్ భార్య స్పందిస్తూ తాము దానిని చాలా ప్రేమగా, కుటుంబంలో సభ్యురాలిలాగా చూసుకుంటామని తెలిపింది. అది అంటే వాళ్ల ఆయనకు ప్రాణమని, ఎన్నో ఏళ్ల నుంచి అది తమతోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త దాని కోసం చాలా ఖర్చు చేస్తారని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన వారు లీ, హూడీ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా కాలం నుంచి వారు నైల్ పరేడ్ కు వస్తారు.కానీ ఎప్పుడు ఆ ఎద్దు తప్పుగా ప్రవర్తించలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nebraska police pull over man with a Watusi bull riding in the passenger’s seat https://t.co/UpzcijbjVN pic.twitter.com/PdQPSt6Kkj
— philip lewis (@Phil_Lewis_) August 30, 2023
- Tags
- Bull
- Man
- small Car
- USA
- viral video
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!