అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు.
White House: అమెరికా అధ్యక్ష భవనంలో వైట్హౌజ్లో అనుమానాస్పదంగా వైట్ పౌడర్ వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఆదివారం సాయంత్రం వైట్ హౌస్ వద్ద అనుమానాస్పద పదార్థాన్ని కనుగొంది.
11 మంది విద్యార్థినులను 'క్లాస్లో షర్టులు తీసేయమని' కోరినందుకు అమెరికాలోని కాలేజీ ప్రొఫెసర్పై వేటుపడింది. ఈ సంఘటన అక్టోబర్ 2019 లో జరిగింది. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.
Alef Model A: ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే కారు ప్రయాణానికి సిద్ధం అవుతోంది. ‘అలెఫ్ మోడల్ ఏ’ ఫ్లైయింగ్ కార్ కి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
Malaria: దోమల ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి అమెరికాను గడగడలాడిస్తోంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఎస్ఏలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల్లో 5 కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDS) ప్రకారం, నాలుగు కేసులు ఫ్లోరిడాలో కనుగొనబడ్డాయి. ఐదో కేసు టెక్సాస్ లో కొనుగొనబడింది. రోగులు విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఈ వ్యాధి స్థానికంగానే సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే టీమ్ భారీ తేడాతో విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ్టి (సోమవారం) మ్యాచ్లో యూఎస్ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా టీమిండియా తర్వాతి ప్లేస్ లో జింబాబ్వే నిలిచింది.
Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదుల్లో భయం పట్టింది. 45 రోజలు వ్యవధిలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. దీంతో మిగతా ఖలిస్తానీ వేర్పాటువాదులు గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఖలిస్తానీల్లో కీలకమైన గురుపత్వంత్ సింగ్ పన్నూ గత కొంతకాలంగా కనిపించడం లేదు.