Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
- వేలిముద్రలు, జిడ్డు మరకలకు ఈజీ సొల్యూషన్స్
- వెనిగర్, బేకింగ్ సోడాతో గోడలు మెరిసిపోతాయి
- క్రేయాన్, పెన్ను గీతలు మాయం చేసే చిట్కాలు
- దోసకాయ, బంగాళాదుంపతోనూ గోడలు క్లీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Easy Wall Cleaning Tips in Telugu: ఇంటి గోడలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలపై పెన్నులు, పెన్సిళ్లు లేదా క్రేయాన్లతో గీతలు గీయడం తరచూ చూస్తుంటాం. కాలక్రమేణా ఈ మరకలు గది అందాన్ని పాడుచేసి, గోడలు మురికిగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే సాధారణ వస్తువులతోనే ఈ మరకలను కొన్ని నిమిషాల్లో మాయం చేయవచ్చు.
1. డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో తేలికపాటి వేలిముద్రలకు చెక్
గోడలపై పడిన సాధారణ వేలిముద్రలను తొలగించడానికి డిష్‌వాషింగ్ లిక్విడ్ అత్యంత సురక్షితమైన , సులభమైన పద్ధతి. ఒక బకెట్లో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను కలపాలి. మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఈ నీటిలో ముంచి, నీరు లేకుండా బాగా పిండేసి మరక ఉన్న చోట మెల్లగా తుడవాలి. మరకలు పోయాక గోడను ఆరనివ్వాలి. ఇంకా తేలికపాటి మరకలు మిగిలి ఉంటే మళ్లీ ఇదే పద్ధతిని పునరావృతం చేయవచ్చు.
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
2. జిడ్డు, నూనె మరకలకు తెల్ల వెనిగర్
గోడలపై ఉన్న మొండి జిడ్డు లేదా నూనె మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ (White Vinegar) అద్భుతంగా పనిచేస్తుంది. వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ సహజంగా జిడ్డును , బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అర కప్పు తెల్ల వెనిగర్‌ను సుమారు రెండు లీటర్ల గోరువెచ్చని నీటిలో కలపి, మైక్రోఫైబర్ వస్త్రంతో వేలిముద్రలు ఉన్న చోట తుడవాలి. ఆ తర్వాత శుభ్రమైన గోరువెచ్చని నీటితో మళ్లీ తుడిచి, పొడి గుడ్డతో ఆరబెడితే మరకలు మాయమవుతాయి.
3. తెల్ల సుద్ద (Chalk) తో జిడ్డు పీల్చేయవచ్చు
జిడ్డు మరకలను, వేలిముద్రలను సులభంగా పీల్చుకోవడానికి తెల్ల సుద్ద ఎంతగానో తోడ్పడుతుంది. ఒక కొత్త సుద్ద ముక్కను తీసుకుని, మరక ఉన్న ప్రదేశంపై మెల్లగా రుద్ది 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత పొడి మైక్రోఫైబర్ గుడ్డతో సుద్దను తుడిచేసి, అనంతరం గుడ్డను కొద్దిగా తడిపి మిగిలిన సుద్దను, మరకను శుభ్రం చేయాలి.
4. పెన్ను, పెన్సిల్, క్రేయాన్ గీతలకు బేకింగ్ సోడా
పిల్లలు గోడలపై గీసిన పెన్ను, పెన్సిల్ , క్రేయాన్ మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్) సత్వర నివారణగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్ తయారుచేసి మరకలపై రాయాలి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తటి గుడ్డతో గోడను శుభ్రంగా తుడిస్తే గీతలు పోతాయి. మరకలు గట్టిపడకముందే వీలైనంత త్వరగా ఈ పద్ధతిని పాటించడం మంచిది.
5. మ్యాజిక్ ఎరేజర్లా పనిచేసే దోసకాయ, బంగాళాదుంప
వింతగా అనిపించినా, గోడలపై ఉన్న పెన్సిల్, పెన్ను గీతలను తొలగించడంలో దోసకాయ , బంగాళాదుంపలు మ్యాజిక్ ఎరేజర్లా పనిచేస్తాయి. దోసకాయను సగానికి కోసి, ఆ ముక్కను పెన్సిల్ గీతలపై రుద్ది, ఆ తర్వాత మెత్తని గుడ్డతో తుడిస్తే గీతలు సులభంగా పోతాయి. బంగాళాదుంపను కూడా సగానికి కోసి, కోసిన భాగంతో పెన్ను లేదా పెన్సిల్ మరకల మీద రుద్ది తుడిస్తే గోడ మళ్లీ శుభ్రంగా మారుతుంది.
(గమనిక: ఏ చిట్కానైనా ఉపయోగించే ముందు, గోడ రంగుకు ఏమైనా నష్టం జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి గోడపై అంతగా కనపడని ఒక చిన్న ప్రదేశంలో ముందుగా పరీక్షించి చూడటం మంచిది.)
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!