India-USA: భారత్-అమెరికాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. “జెట్ ఇంజన్ల” తయారీకి ఒకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-USA: భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది. చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఒకే చెప్పింది. దీంతో భారత వైమానికి దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజిన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమం అయింది. ఇది రెండు దేశాల రక్షణ సహకారాని పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయడానికి GE ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని ఆమోదించడం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి పెద్ద విజయం. భారతదేశ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒప్పందం సుగమం అయింది. ఈ ఒప్పందంలో సంయుక్తంగా జెట్ ఇంజన్లు తయారీ చేయడంతో పాటు సాంకేతిక బదిలీ, లైసెన్సింగ్ ఏర్పాటు ఉన్నాయి. ఈ ఒప్పందంలో 99 జెట్ ఇంజన్ల సంయుక్త ఉత్పత్తి కూడా ఉంది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
Rwad Also: Donald Trump: వైస్ ప్రెసిడెంట్ పదవిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. “వివేక్ రామస్వామి”పై ప్రశంసలు..
గేమ్ ఛేంజర్ ఒప్పందం:
భారత రక్షణ రంగ నిపుణులు ఈ ఒప్పందాన్ని గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. దీని వల్ల జీఈ ఏరోస్పేస్ తన 80 శాతం టెక్నాలజీని F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌ల ఉత్పత్తి కోసం భారతదేశానికి బదిలీ చేస్తుంది. దీని వల్ల స్వదేశీ తయారీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(LCA) MKII పనితీరు మరింత మెరుగుపడుతుంది.
హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అంతన కృష్ణన్ మాట్లాడుతూ.. ఇది చాలా కీలక ఒప్పందం అని అన్నారు. దీని వల్ల రానున్న కాలంలో భారత వైమానిక శక్తికి ఊతమనిచ్చే స్వదేశీ ఇంజన్లు తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!