NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK111: నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడటంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన కాలుకి విజయవంతంగా చిన్న శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇదే సమయంలో బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘ఎన్బికె111’ చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్బికె111’ దర్శకుడు గోపీచంద్ మాలినేని బాలకృష్ణ ఆరోగ్యం కోసం బెంగళూరులోని హుస్కూర్, కంబలిపురలో ఉన్న కాటేమ్మ ఆలయంలో ఈ రోజు ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ పూజల్లో సుమారు 18 మంది పూజారులు పాల్గొనగా, బాలయ్యకు చెందిన పలువురు వీరాభిమానులు కూడా హాజరై ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మరోవైపు బాలకృష్ణ ఈరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు మరికొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తిగా ఆగిపోకుండా, తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన నటీనటులతో షూటింగ్ కొనసాగించాలని బాలయ్య స్వయంగా చిత్రబృందానికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాయం ప్రభావం సినిమా విడుదల తేదీపైనా పడే అవకాశం కనిపిస్తోంది. మొదట నిర్మాతలు ‘ఎన్బికె111’ను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బాలయ్య రికవరీకి పట్టే సమయాన్ని బట్టి షూటింగ్ షెడ్యూల్లో మార్పులు రావచ్చని సమాచారం. దీంతో విడుదల కూడా వాయిదా పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే బాలకృష్ణ ఆరోగ్యం మెరుగుపడుతుండటం ఊరటనిస్తోంది. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లో అడుగుపెడతారని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ‘ఎన్బికె111’ విడుదల తేదీపై స్పష్టత రాబోయే రోజుల్లో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!