12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto Pad 70: మోటరోలా నుండి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ Moto Pad 70ను భారత మార్కెట్లో ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు కంపనీ ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు అధికారికంగా వెలుబడ్డాయి. 5G కనెక్టివిటీ, పెద్ద 12.1-అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, భారీ 10,200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ రానుంది.
2.5K డిస్ప్లే:
Moto Pad 70లో 12.1-అంగుళాల 2.5K రిజల్యూషన్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ (HBM)ను సపోర్ట్ చేయడంతో పాటు DCI-P3 కలర్ గామట్లో 96 శాతం కవరేజ్ అందిస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, కంటెంట్ వీక్షణకు మెరుగైన విజువల్ అనుభవాన్ని అందించనుంది. ఈ ట్యాబ్లెట్‌తో పాటు Moto Penను కూడా కంపెనీ బాక్స్‌లోనే అందించనుంది. ఇందులో 4096 స్థాయిల ప్రెషర్ సెన్సిటివిటీ, Tilt Detection, Palm Rejection వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రాయింగ్, నోట్ తీసుకోవడం, డిజిటల్ రైటింగ్ వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
AI ఫీచర్స్:
Moto Pad 70లో పలు AI ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో AI Rewrite, Circle to Search, AI Summary, AI Continue Writing వంటి ఫీచర్లతో పాటు Google Gemini ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. ఇవి కంటెంట్ రైటింగ్, సెర్చ్, నోట్స్ తయారీ వంటి పనులను మరింత సులభతరం చేస్తాయి.
చిప్ సెట్, భారీ బ్యాటరీ:
ఈ ట్యాబ్లెట్లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ట్యాబ్లెట్ మందం కేవలం 6.29mm కాగా, బరువు 530 గ్రాములు మాత్రమే. ఇందులో 10,200mAh బ్యాటరీను అమర్చారు. దీనికి 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇందులో డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్లు ఉంటాయి. అలాగే Smart Connect ఫీచర్ ద్వారా ఇతర మోటోరోలా డివైస్లతో ఫైళ్లను సులభంగా షేర్ చేసుకోవచ్చు.
Moto Pad 70 ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ముందుగానే వస్తుంది. దీనికి ఆండ్రాయిడ్ 18 వరకు OS అప్డేట్లు, అలాగే 2030 వరకు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది. Moto Pad 70 భారత మార్కెట్లో ఆగస్టు 9న లాంచ్ కానుంది. లాంచ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!